విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుకుంటున్న హరిహర వీరమల్లు రోజుకో న్యూస్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. నిన్న పవన్ చేస్తున్న స్టంట్స్ ప్రాక్టీస్ ఫొటోస్ విడుదల కాగా తాజాగా సినిమాకు ఆర్ట్ డైరెక్టరుగా పని చేసిన తోట తరణి గారికి పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కరించిన ఫొటోస్ హల్చల్ చేస్తున్నాయి.
హైద్రాబాదులో హరిహర వీరమల్లు సినిమా కోసం తోట తరణి వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటికే పలువురు కొనియాడారు. ఆ సెట్టింగులకు పవన్ ముగ్దుడయ్యాడని సమాచారం.17వ శతాబ్దం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా చేసిన ఆర్ట్ వర్క్ సినిమాకి ప్రాణం పోస్తుందన్నారు.
సినిమా సెట్స్ మీద పవన్ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సన్మానించారు. పవన్ పుష్పగుచ్చం ఇచ్చి,శాలువా కప్పి తోట తరణికి ఆత్మీయ సత్కారం చేశారు. ఇప్పుడు ఈ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు పవన్ అభిమానులు. పిక్స్ లో ఉన్న పవన్ మేకోవర్ తో పవన్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
F3 Review – Over the Top but Faisa Vasool
Akira Drops Pawan Kalyan’s Surname!