వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదనే కాకుండా, వారి కుటుబం సభ్యుల మీద నోరుపారేసుకున్న ఉదంతాలు కోకొల్లలు. విపక్ష నేతల కుటుంబంలో మహిళలను కూడా రోడ్డుమీదకు తీసుకురావడానికి క్షణ కాలమైనా ఆలోచించని వీరు ఇప్పుడు సొంత పార్టీ నేతల కుటుంబ సభ్యులకే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే ప్రతిపక్షాలకు.,ప్రజలకు ఎం సమాధానం చెప్తారో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రజలు.
వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి పై చెన్నై లోని జార్ట్జ్ టౌన్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2016లో సెల్వమణి.,కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో సెల్వమణి ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అందుగాను బోద్రా సెల్వమణి.,అన్బరసు మీద పరువు నష్టం కేసు వేశారు.
అయితే ముకుంద్ బోద్రా మరణించడంతో అయన కుమారుడు గగన్ బోద్రా కేసుని నడిపిస్తున్నారు. వారిద్దరి పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసారు. తన చేతల కన్నా నోటికే ఎక్కవ పని చెప్పే రోజాగారి నోరు ఇప్పుడు తెరుచుకుంటుందా? అంటూ ప్రతిపక్షల నోటికీ రోజా పనిచెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు మంత్రి పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకుని., జగన్ కు భజనలు చేస్తూ., వేయి కళ్ళతో ఎదురుచూసిన మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం మొదలైన తరుణంలో ఈ సంఘటన రోజాకు ఒక పెద్ద షాక్ లాంటిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జగన్ తన భక్తుల కోరికలు తీరుస్తారో లేదో అంటూ ఆసక్తి చూస్తున్నారు పార్టీలో ఆశావాదులు.
ABN RK: Will MNCs Sign MOUs With CM On Bail?
Allu Arjun Fans Behaving Like NTR Fans!