arrest-warrant-against-jeevitha-rajasekhar‘చెక్ బౌన్స్’ కేసు జీవితా రాజశేఖర్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 2013లో ఒక వ్యక్తీ నుండి 5 లక్షల అప్పు తీసుకుని 2 చెక్కులు ఇచ్చిన జీవిత, ఆ తర్వాత ఆ చెక్కులను ‘హానర్’ చేయడంలో విఫలమయ్యారు. అకౌంట్ లో సరిపడ మొత్తం లేకపోవడంతో చెక్కులు ‘రిటర్న్’ అయ్యాయని సదరు వ్యక్తి గత ఏడాది అక్టోబర్ లో కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో విచారణ చేపట్టిన నంద్యాల మేజిస్ట్రేట్ కోర్టు జీవితా రాజశేఖర్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. గత కొంత కాలంగా విచారణకు హాజరు కాకపోవడంతోనే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా న్యాయవాదులు చెప్తున్నారు. నిజానికి జీవితా రాజశేఖర్ కు ఇలాంటి కేసులు కొత్త కాదు.

2008, 2010 సంవత్సరాలలో జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహంకాళి, సత్యమేవ జయతే’ వంటి సినిమాల సందర్భంలో కూడా ఆమె పై అరెస్ట్ వారెంట్ లు జారీ కావడం జరిగింది. “చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుందన్న” చందంగా జీవిత పరిస్థితి తయారయ్యిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.