Arjun Reddy Becomes Shockingly Savage at Pre-Release Event“అర్జున్ రెడ్డి” సినిమాతో కనివినీ ఎరుగని భారీ హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్న విజ‌య్ దేవ‌రకొండ త‌న సినిమాలోని అన్ని సీన్ల‌ను స‌మ‌ర్థించుకుంటున్నాడు. ఈ సినిమాలో ఎన్నో బూతు డైలాగులు, లిప్ లాక్ సీన్లు ఉన్నాయ‌ని, పొగ‌తాగ‌డం వంటివి చూపించార‌ని వీటి నుంచి ఏం నేర్చుకోవాల‌ని ప్రముఖ మీడియా ఛానల్ ప్రశ్నలు గుప్పించింది. దీనికి విజయ్ తనదైన శైలిలో జవాబిచ్చారు తప్ప, అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం డిఫెన్స్ లో పడకపోవడం విశేషం.

“ఈ సినిమాలో మీ ఫోక‌స్ అంతా ఆ సీన్ల‌పైనే ఉంది… మీ ప‌ర్స‌న‌ల్ ఒపీనియ‌న్ అంటూ… మీరు పొగ‌తాగుతారా?” అని అడిగాడు. దీంతో ఆ యాంక‌ర్ నేను పొగ‌ తాగ‌బోన‌ని చెప్పగా, మిమ్మ‌ల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇత‌ర సినిమాలు కూడా ఇటువంటి పోస్ట‌ర్లే పెడితే ప‌రిస్థితి ఏంట‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించింది. అలా చేస్తే ఆ సినిమా తీసే వారిదే త‌ప్ప‌వుతుంద‌ని, మీరు 90 శాతం ఫోక‌స్ ఈ సినిమాలోని అటువంటి డైలాగుల‌పైనే పెట్టారు కాబ‌ట్టి ఇలా అడుగుతున్నారని సదరు యాంకర్ నే డిఫెన్స్ లో పడేసే విధంగా మాట్లాడారు.

“మీకు న‌చ్చ‌లేద‌ని ఆ సీన్లు తీసేయడం కుద‌ర‌దు… ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్ట‌ర్ అదేన‌ని, అలాగే ప్ర‌వ‌ర్తిస్తాడు” అని హీరో గారు సెలవిచ్చారు. సినిమాలో చూపించారు కాబ‌ట్టి ప్ర‌జ‌లు వాటిని అనుక‌రిస్తార‌ని అనుకుంటే పొర‌పాటేనని తేల్చిచెప్పాడు. రెండు సినిమాలు హిట్ కాగానే మీకు పొగరు వచ్చేసిందని కొందరు అనుకుంటున్నారని యాంకర్ అనగా… అనుకునే వారు అనుకుంటూనే ఉంటారని, తాను మాత్రం కరెక్టుగానే ఉన్నానని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సమర్ధించుకున్నాడు.