arjun-reddy-shalini -pandeyఈ నెల 25వ తేదీన విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. విడుదలై వారం కూడా కాకముందే ఈ సినిమా కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అమెరికాలో కేవలం 89 థియేటర్స్ లో మాత్రమే విడుదలైన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను వసూలు చేసింది. ఇంత తక్కువ థియేటర్స్ లో విడుదలై .. ఇంత తక్కువ సమయంలో ఒక మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యచకితులను చేసింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే ఫేస్ బుక్ లైవ్ లోకి రాగా, ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. “ఈ సినిమాలో హీరోతో మీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది కదా, మీరిద్దరూ నిజంగానే లవ్‌ లో ఉన్నారా?” అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఆమె గడుసుగా సమాధానం చెబుతూ, ‘‘అలాంటిదేమీ లేదు. మేమిద్దరం… అంటే విజయ్ దేవరకొండ, షాలినీ లవ్ చేసుకోలేదు. సినిమాలో ప్రీతి, అర్జున్ లు మాత్రమే లవ్ చేసుకున్నారు. వాళ్ల లవ్ బలమైనది కాబట్టే వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగా వర్కవుట్ అయింది’’ అంటూ చెప్పింది. ఈ సమాధానంతో అభిమాని కూడా ఏకీభవించాడు.