arjun-reddy-movie- theatrical-trailer‘పెళ్లి చూపులు’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న విజయ్ దేవరకొండ నటిస్తోన్న “అర్జున్ రెడ్డి” సినిమా ఫస్ట్ లుక్ నుండే వీక్షకులను ఆకర్షిస్తోంది. హీరోయిన్ తో కలిసి ‘లిప్ లాక్’ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్, అప్పటి నుండి నేటి ట్రైలర్ వరకు “అర్జున్ రెడ్డి” క్యారెక్టర్ కే ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ప్రమోషన్లు చేస్తోంది. విశేషం ఏమిటంటే… ఇప్పటివరకు విడుదల చేసినవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజా ట్రైలర్ విషయానికి వస్తే… టైటిల్ కు తగ్గట్లుగా ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్ ను ఫుల్లుగా చూపించారు. ట్రైలర్ లో ‘అమిత్ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ సెన్సార్ కటింగ్ ను గురైనా, దాని భావం ఏంటో వీక్షకులకు తెలిసేలా చిత్రీకరించారు. ముఖ్యంగా కుర్రకారుకు బాగా కనెక్ట్ చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే చివర్లో బాటిల్ ను ఊపే సీన్ కూడా ఇదే తరహాలో డబుల్ మీనింగ్ లో చిత్రీకరించినట్లుగా కనపడుతోంది. ఇక మధ్యలో చూపించిన ‘రెడ్డి’ గారి క్యారెక్టర్ కాస్త కొత్తగానే ఉంది.

క్లాస్ రూమ్ లోకి వెళ్లి… అచ్చమైన తెలుగులో చెప్తున్నాను… అంటూ తాను ఓ ఫిగర్ కు లైన్ వేస్తున్నాను, ఆమెను మినహాయించి ఎవరినైనా చూసుకోండి అంటే చెప్పే సన్నివేశం బాగుంది. అలాగే ఆ తర్వాత హీరోయిన్ విజయ్ మీద పడుతూ చూపించే సీన్, గడ్డంతో విజయ్ నేల మీద పడిపోయే సన్నివేశం… ఇలా ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేసారు. ఈ నెల 25వ తేదీ నుండి తన క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ లో చూపిస్తానని ‘రెడ్డి గారి ట్రైలర్’ చివర్లో స్పష్టం చేసింది.