Arjun Reddy movie collectionsఈ ఏడాది తెలుగు సినిమా వెలిగిపోతోంది. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల విజయంతో మొదలుపెడుతూ తాజాగా “అర్జున్ రెడ్డి” వరకు అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించాయి. అయితే తెలుగు ప్రేక్షకులకు క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అలరించిన చిత్రాలు మాత్రం బహు అరుదు. ప్రతి సినిమా ఏదొక జోనర్ కు మాత్రమే పరిమితం అవుతూ… ఆ వర్గం ప్రేక్షకులనే ఆకట్టుకుంటోంది. కానీ “బాహుబలి 2” సినిమా మాత్రం ఏ,బీ,సీ అన్న తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ అల్లాడించింది.

ఈ సినిమా తర్వాత విజయం సాధించిన బొమ్మలు కూడా అలా సెగ్మెంట్ల వారీగా మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. కానీ లేటెస్ట్ సెన్సేషన్ “అర్జున్ రెడ్డి” మాత్రం ‘బాహుబలి 2’ మాదిరే క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్నీ సెంటర్లలోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిజానికి పబ్లిసిటీ ప్రకారం ఇది యూత్ ను బేస్ చేసుకుని విజయవంతం అయ్యే సినిమాగా ట్రేడ్ పండితులు లెక్కకట్టారు. కానీ రిలీజ్ తర్వాత అన్నీ సెంటర్స్ ‘హౌస్ ఫుల్’ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

దీంతో ఫస్ట్ డే రోజున అంచనాలకు అందని రీతిలో వసూళ్లు ఉన్నాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా 3 కోట్లకు చేరువగా ఈ ఫిగర్స్ ఉండగా, ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించి, మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరడానికి ఉరకలు వేస్తోంది. ఈ వీకెండ్ నాటికి 1 మిలియన్ డాలర్స్ లో చేరినా… ఓవరాల్ గా 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరడం పక్కా అన్న అంచనాలు ఉన్నాయి. అలాగే తొలి మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణాలలో కూడా కళ్ళు చెదిరే కలెక్షన్స్ రానున్నాయని టాక్.