ఒకే ఒక్క హిట్ చిత్రంలో నటించిన హీరో… ఏ మాత్రం క్రేజ్ లేని దర్శకుడు, ఆయనకు తగ్గట్టే పేరు కూడా పరిచయం లేని హీరోయిన్… మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా… కట్ చేస్తే… “అర్జున్ రెడ్డి” అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. కాలేజీ కుర్రకారును విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన “అర్జున్ రెడ్డి” సినిమా టికెట్లు, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం… అగ్ర హీరోల సినిమాల మాదిరి సీట్స్ క్లోజ్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఏది లేదనే చెప్పవచ్చు. ఒక విధంగా ‘బాహుబలి 2’ తర్వాత రియల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమాగా “అర్జున్ రెడ్డి” నిలుస్తోంది. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ శుక్రవారం నాడు విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎంపిక చేసిన ప్రదేశాలలో ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ షోలను కూడా ప్రదర్శించబోతున్నారు. దీంతో ‘అర్జున్ రెడ్డి’ టాక్ ఒక రోజు ముందే వెలువడనుంది. అయితే చిత్ర హీరో విజయ్ దేవరకొండ మాత్రం, పక్కా కాన్ఫిడెన్స్ తో ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఖాయం అంటున్నాడు.
Also Read – త్యాగాలకు న్యాయం కావాలి…పొత్తుకు న్యాయం చెయ్యాలి..!