Archana vijay - virat Kohli Controversy IPL 10వాక్చాతుర్యంతో పాటు మేని అందాలతో క్రికెట్‌ యాంకరింగ్‌ కు కొత్త రూపు తీసుకొచ్చిన అర్చనా విజయ ఈ మధ్యే ఐపీఎల్ సందర్భంగా కోహ్లీని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా చిరుగుల జీన్ ను ధరించి కోహ్లీని ప్రశ్నించింది. అయితే సమాధానాలు చెప్పే సమయంలో సహజంగా కళ్లలోకి చూసే కోహ్లీ… ఆ సమయంలో మాత్రం ఆమె కాళ్ల వైపు చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనికి నెటిజన్లు తమాషా కామెంట్లతో వైరల్ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా స్పందించిన అర్చనా విజయ… ‘దేవుడా! జనాలు శీర్షికల కోసం ప్రయత్నిస్తున్నారా? లేక మమ్మల్ని దిగజార్చాలని అనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించింది. విరాట్‌ గొప్ప క్రికెటర్‌ అని చెప్పింది. కోహ్లీని చూసి తామంతా స్ఫూర్తి పొందుతామని చెప్పింది. కోహ్లీ చూపు, ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయని చెప్పింది. నెటిజన్లు అనుకుంటున్న ఉద్దేశంతో కోహ్లీ తనను చూడలేదని, అసలు కోహ్లీ చిరుగుల ప్యాంటు వెనుక ఉన్న తన కాళ్లను పరిశీలించడం లేదని… ఇంకా చెప్పాలంటే అసలు తన కాళ్లనే చూడలేదని తెలిపింది.

తాను వెంట వెంటనే ప్రశ్నలు అడుగుతుండడంతో… తన ఒడిలో ఉన్న ప్రశ్నల ప్యాడ్‌ ను చూస్తున్నాడని తెలిపింది. దీనికి నెటిజన్లు పెడార్థాలు తీస్తూ సోషల్ మీడియాలో అపార్థం చేసుకున్నారని, కోహ్లీ తనకెంతో సన్నిహితుడని, ఆప్యాయంగా పలకరిస్తాడని, అతను మరో ఉద్దేశంతో చూడడని తేల్చి చెప్పింది. మొత్తానికి ఈ వివాదానికి శుభంకార్డు వేసే కార్యక్రమంలో అర్చనా ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్లుగా కనపడుతోంది. అయితే అర్చనా చెప్పిన విషయంలోనూ నిజం లేకపోలేదు.