Aravindha Sametha movie Teaser Talkజూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్… త్రివిక్రమ్ అంటే క్లాస్… ఇది వీరిద్దరి గురించి సింపుల్ గా చెప్పాలంటే..! మాస్ లో తారక్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండగా, క్లాస్ ను పడేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. అయితే కెరీర్ లో తొలిసారిగా తనలోని మాస్ యాంగిల్ ను పూర్తి స్థాయిలో త్రివిక్రమ్ ఆవిష్కృతం చేయబోతున్నాడేమోనన్న సంకేతాలను “అరవింద సమేత” ఫస్ట్ టీజర్ కల్పించింది.

రెగ్యులర్ మాస్ దర్శకుల షాట్స్ ను త్రివిక్రమ్ తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అన్న విషయం… టీజర్ లోని ఫస్ట్ షాట్ నుండే చెప్తుంది. కత్తి పట్టుకుని అరటి మొక్కను నరికివేసిన షాట్… ముందు, వెనుక రౌడీలను కత్తి పట్టుకుని పొడిచే షాట్… కుర్చీతో ఒక్కసారిగా రౌడీ మీదకు దూకే షాట్… ఇవన్నీ త్రివిక్రమ్ మార్క్ షాట్స్ గా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ‘ఐ ఫీస్ట్’ అని చెప్పవచ్చు.

అక్కడనుండి కట్ చేస్తే మిగిలినదంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎస్.ఎస్.థమన్ సొంతం . ‘రం…రూధిరం… రం…సమరం…’ అంటూ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది, హీరోయిజాన్ని సరిగ్గా ఎలివేట్ చేసాడు. తన సినిమాలలో వినిపించే సహజసిద్ధ డైలాగ్ లకు విభిన్నంగా ఈ టీజర్ లో ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ డైలాగ్స్ వినిపించాయి.