Aravindha-Sametha-First-Look--Jr-NTRజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం మహర్దశలో ఉంది. ‘టెంపర్’ నుండి మొదలైన కీర్తి ప్రతిష్టతలను ‘నాన్నకు ప్రేమతో’ మరింతగా పెంచగా, ‘జనతా గ్యారేజ్’తో తన కెరీర్ లో బెస్ట్ కమర్షియల్ సక్సెస్ ను నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ‘జై లవకుశ’ సినిమాతో మూడు విభిన్నమైన పాత్రలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తారక్, కాస్త గ్యాప్ తీసుకుని “అరవింద సమేత వీరరాఘవ”గా రాబోతున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసారు. సిక్స్ ప్యాక్ పోస్టర్ తో అదిరిపోయే లుక్ లో కనపడుతోన్న తారక్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గతంలో ‘టెంపర్’ సినిమాలో ఇలాగే సిక్స్ ప్యాక్ లో కనిపించారు గానీ, ఈ సారి మరింత పవర్ ఫుల్ గా, అగ్రెసివ్ గా కనపడుతున్నాడు. ఆయుధం పట్టుకుని యాక్షన్ లుక్ లో ఫ్యాన్స్ కు ఫీస్ట్ చేస్తోన్న ఈ పోస్టర్ లో అసలు స్పెషాలిటీ వేరే ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటిసారిగా ఒక లేడీ ఓరియెంటెడ్ టైటిల్ ను ఓకే చేయడం విశేషం. ఈ టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనపడుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఒక మాస్ స్టార్ హీరోకు ఇలాంటి టైటిల్ పెట్టడం సాహసమే. అయితే ఉప శీర్షికలో ‘వీరరాఘవ’ అన్న పేరు కూడా పెట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ నేమ్ ను కూడా ‘మాటల మాంత్రికుడు’ అభిమానులకు తెలియజేసినట్లయ్యింది.