Aravindha Sametha -Anaganaganaga త్రివిక్రమ్ శ్రీనివాస్ – జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్ లో మొదటిసారిగా తెరకెక్కుతున్న “అరవింద సమేత”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన ఈ ఆల్బమ్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మరి అంత అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అంటే… కాస్త ఆలోచించాల్సిన విషయమే అని చెప్పాలి.

ఈ లిరికల్ వీడియోలో మొదటగా కనిపించిన పూజా హెగ్డే – జూనియర్ ఎన్టీఆర్ షాట్స్ మరియు చివరగా వినిపించిన ‘అనగనగనగా అరవిందట తన పేరు… అందానికి సొంతూరు… అందుకనే ఆ పొగరూ… అరెరెరె… అటు చుస్తే కుర్రాళ్ళు… అసలేమైపోతారు… అన్యాయం కద ఇది అనరే ఎవరూ…’ అన్న లిరిక్స్ యూనివర్సల్ గా మంచి ఆదరణను పొందాయి.

అయితే ఈ రెండింటి నడుమ వినిపించిన సాహిత్యం మాత్రం ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. బహుశా వినగా వినగా వినసొంపుగా మారుతుందేమో చూడాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం త్రివిక్రమ్ స్టైల్ లో ఫన్నీగా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వేచిచూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సాంగ్ నూతన ఉత్సాహాన్ని పంచింది.