Aravinda Sametha Veera Raghava Audio Launch on 20th septemberవచ్చే నెల 11వ తేదీన విడుదల కానున్న “అరవింద సమేత” సినిమాకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. కానీ ప్రమోషన్స్ లో వేగమే మందగించింది. హరికృష్ణ మరణం ఇందుకు ప్రధాన కారణం కాగా, ఇప్పుడిప్పుడే అందులో నుండి బయటపడిన జూనియర్ ఎన్టీఆర్ కో, ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. ఇందుకు వినాయకచవితి పర్వదినాన్ని వేదికగా ఎంచుకున్నారు.

ఈ సందర్భంగా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆడియోను ఈ నెల 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఖరారు చేసారు. ఎస్.ఎస్.థమన్ స్వరాలు అందించిన ఈ సినిమా పబ్లిసిటీ ఇక నుండి వేగం పుంజుకుంటుందని కూడా స్పష్టం చేసారు. ఈ వారంలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి… వేచిచూడండి… అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచింది చిత్ర యూనిట్.