ar-murugadoss announces Sambhavami release dateప్రిన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో సినిమాకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం తెలియజేయని దర్శకుడు మురుగదాస్, తొలిసారిగా ‘ట్విట్టర్’ విప్పారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా ట్వీట్ చేసారు.

“జూన్ 23వ తేదీన ధియేటర్లలో మా అతిధులుగా భాగస్వామ్యులు కండి… చాలా ఎక్సైటింగ్ గా ఉందంటూ” ట్వీట్ చేయడంతో విడుదల తేదీ సస్పెన్స్ కు తెరపడింది. ఈ సమాచారాన్ని ఇటీవల బిఎ రాజు తదితరులు ఇప్పటికే స్పష్టం చేయగా, తాజాగా మురుగదాస్ దానిని ధృవీకరించారు. అయితే ఈ సినిమాపై ఇంకా క్లారిటీ రావాల్సిన విషయాలు అయితే అభిమానులకు చాలానే ఉన్నాయి.

ఫస్ట్ లుక్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రతి పండగకు ఫస్ట్ లుక్ వస్తుందని ప్రిన్స్ అభిమానులు హల్చల్ చేయడం, తర్వాత నిరాశతో తదుపరి పండగ వైపుకు చూడడం, గత నాలుగైదు నెలలుగా జరుగుతూ వస్తోంది. అలాగే తొలి టీజర్ విశేషాలు కూడా ఇంతే. దీంతో వీటిపై కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇస్తే చాలంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న టాక్ ప్రకారం అయితే… ‘ఫస్ట్ లుక్ అండ్ టీజర్’ విడుదలకు ఉగాదికి ముహూర్తం పెట్టినట్లుగా తెలుస్తోంది.