APCRDA survey in capital amaravati lands అమరావతిలో రైతుల నుండి సమీకరించిన 1251 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతిని అభివృద్ధి చెయ్యకుండా భూములని పందేరం చెయ్యడం తగదని అమరావతి రైతులు కోర్టుని ఆశ్రయించారు.

ఇప్పటికే అమరావతి మీద కోర్టు వివాదాలు నడుస్తున్నందున అవి తేలే వరకు భూములలో యధాస్థితిని కొనసాగించాలని రైతులు వేసిన పిటీషన్లతో కోర్టు ఏకీభవించింది. అయితే దేశం మొత్తం దృష్టి కరోనా మీద ఉండగా… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైలెంట్ గా అమరావతిలో తన పని తాను చేసుకుపోతుంది.

హై కోర్టు స్టేని ధిక్కరించి రాజధాని గ్రామాల్లో రెసిడెన్షియల్ జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం అనుకున్నట్టు రాజధాని భూములను పేదలకు పంచిపెట్టే పనిలో ఉన్నారు. సీఆర్డీఏ అధికారులు రాజధాని రైతులకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెబుతున్నారు.

దేశ వ్యాప్త లాక్ డౌన్ సమయంలో ఈ వేధింపులు ఏమిటి అని రైతులు ప్రశ్నించగా అదే ఇబ్బంది అయితే స్కైప్ ద్వారా రైతులు అభిప్రాయాలను చెప్పాలని అధికారులు చెప్పడం విశేషం. రైతులలో ఎంత మందికి స్కైప్ తెలిసి ఉంటుంది అనే ప్రశ్నకు మాత్రం వాళ్లు సమాధానం చెప్పడం లేదు.