APCID Raghu Rama Krishnam Rajuసికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను సీఐడీ కస్టడీలో టార్చర్ చేసి ఉండవచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆర్మీ ఆసుపత్రి రిపోర్ట్ ప్రకారం ఆయనకు ఒక ఫ్రాక్చర్, కొన్ని గాయాలు ఉన్నాయి. దీనితో సీఐడీ ఇరుకునపడినట్టు సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆర్ఆర్ఆర్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.

అయితే ఆర్మీ ఆసుపత్రి రిపోర్టు ని సీఐడీ తమకు అనుకూలంగా అన్వయించుకుని పని మొదలుపెట్టింది. కాళ్లకు గాయాలున్నాయని ఆర్మీ ఆస్పత్రి నివేదికలో చెప్పలేదనే వాదన వినిపించింది. ఆర్మీ ఆసుపత్రి నివేదిక బయటకు వచ్చిన చాలా రోజులకు తీరికగా ఆలోచించుకుని సీఐడీ ఒక ప్రెస్ నోట్ విడుదల చెయ్యడం గమనార్హం.

ఒకవేళ వారు చెప్పేది నిజమైతే… ఆ దెబ్బలు అరెస్టుకు ముందువి అయ్యి ఉండాలి లేక కస్టడీలో రఘురామ కృష్ణంరాజు తనను తాను కొట్టుకుని ఉండాలి. అరెస్టు చేసిన వెంటనే ఎంపీకి వైద్య పరీక్షలు చేసి ఉండాలి. చేస్తే ఆ గాయాలు సీఐడీ నమోదు చేసిందా? సరే కస్టడీలో రఘురామ కృష్ణంరాజు తనను తాను కొట్టుకున్నారు అనుకుందాం.

నిత్యం పోలీసు పహారా మధ్య అది సాధ్యమా? ఒకవ్యక్తి తనని తాను ఫ్రాక్చర్ అయ్యేలా కొట్టుకోవడం సాధ్యమా? సీఐడీ విడుదల చేసిన తాజా ప్రెస్ నోట్ కారణంగా ఏజెన్సీ ఈ కేసు నుండి బయటపడే అవకాశం లేదు. ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు సీఐడీ, అటు ఏమీ లేదని రిపోర్టు ఇచ్చిన గుంటూరు డాక్టర్లు చాలా సమాధానాలు చెప్పుకోవాలి.