Ap tickets Issue nagababu dumb ott ideaగతంలో ఏ హీరో సినిమా విషయంలోనూ జరగనంత రచ్చ ఇప్పుడు పవన్ మూవీ విషయంలో జరుగుతోంది. రీసెంట్ గా వచ్చిన భీమానాయక్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమా మీద పెద్ద వివాదమే జరుగుతోంది. కావాలనే కొత్త జీవో లేట్ చేశారని, టికెట్ల రేట్లు తగ్గించారని, జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందని పవన్ అభిమానులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.

ఇక ఈ విషయంపై పవన్ గానీ చిరు గానీ మాట్లాడకపోయినా.. మెగా బ్రదర్ నాగబాబు తెరపైకి వచ్చేశారు. మా తమ్ముడిని అణ‌గదొక్కుతున్నారని, వైసీపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా పవన్ కు అండగా రాకపోవడం దురదృష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన హీరోల రెమ్యునరేషన్ విషయంలోనే మాట్లాడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో వైసీపీ వాళ్లకు పడని వర్గాల వారు ఉన్నారని, వారి ఆర్థిక మూలాలు దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే కమ్మ, కాపు కులాన్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది అని నాగబాబు చెప్పినట్టు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ ఈ రెండు వర్గాలకు చెందిన వారే.

కాబట్టి వారిని నాగబాబు తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. మీరు మాకు మద్దతుగా మాట్లాడకపోయినా, మేము మీకు సపోర్ట్ చేస్తామంటూ చెబుతున్నారు. ఒకవేళ ఆంధ్రాలో సినిమాను బ్యాన్ చేసిన సరే భయపడవద్దని, ఆంధ్రా వ‌ర‌కు మనకు యూట్యూబ్ తో పాటు, అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయని ధైర్యం చెబుతున్నారు. తెలంగాణ‌తో పాటు ఓవ‌ర్సీస్ లో మాత్రం థియేట‌ర్ల‌లో వేసుకోండంటూ స‌ల‌హాలు ఇచ్చేస్తున్నారు నాగ‌బాబు.

వాస్త‌వంగా చూసుకుంటే నాగ‌బాబు చెప్తున్న మాట‌లు అస్స‌లు సాధ్యం కావు. ఎందుకంటే థియేట‌ర్ల‌లో జ‌రిగే బిజినెస్ ఓటీటీలో జ‌ర‌గ‌దు. దాంతో స్టార్ హీరోల మార్కెట్ ఆటో మేటిక్ గా ప‌డిపోతుంది. ఆంధ్రాలో ఒక ఏరియాలో జ‌రిగే మార్కెట్ విలువ ఆధారంగా ఓటీటీలో మార్కెట్ జ‌ర‌గ‌దు. పైగా పైర‌సీ భూతం వెంటాడుతుంది. తెలుగులో ఒక హీరో మూవీ రూ.100కోట్ల బిజినెస్ చేస్తే అందులో దాదాపు రూ.60 కోట్ల దాకా ఆంధ్రా థియేట‌ర్ల నుంచే వ‌స్తుంది. కానీ ఓటీటీ ఈ లెక్క‌న బిజినెస్ చేయ‌దు. దేశం మొత్తానికి క‌లిపి బిజినెస్ ను లెక్కిస్తుంది. కాబ‌ట్టి నాగ‌బాబు ఇస్తున్న ఐడియా డంబ్ ఐడియా అనే చెప్పుకోవ‌చ్చు.