AP - Telangana News - TDP MLAరాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన అనేక వివాదాలు అలా పెండింగ్ పడగా, తాజాగా అందులో ఓ వివాదం మాత్రం శుభంకార్డు వేయించుకుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించిన ఈ వివాదంలో… కోర్టు కేసులు, బ్యాంక్ అకౌంట్ల సీజ్ వరకు వెళ్ళగా… ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ, తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డిల సంప్రదింపుల ఫలితంగా సమస్యకు పరిష్కారం లభించింది.

జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని రెండు రాష్ట్రాల మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు 640 కోట్లు, తెలంగాణకు 465.64 కోట్లు చెందుతాయి. పది రోజుల్లోగా ఈ డబ్బు పీడీ ఖాతాలకు చేరుతుందని ఏపీ మంత్రి పితాని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల సాధనకు ఇదొక ముందడుగుగా అభివర్ణించిన పితాని, సమస్య పరిష్కారానికి తెలంగాణ సర్కారు చూపిన చొరవ అభినందనీయమని అన్నారు.