ap people about prajavedhika demolishingఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒకే ఒక్కడులో అర్జున్ లాగా వ్యవస్థను ప్రక్షాళన చేస్తా అక్రమ నిర్మాణాలు తొలగిస్తా అంటూ చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చారు. ఆ తరువాత అక్రమ నిర్మాణాల తొలగింపు అనేది కేవలం టీడీపీ నాయకుల నిర్మాణాల వరకే ఆగిపోయింది.

ప్రజాధనం వృధా అవుతున్నా జగన్ పట్టించుకోలేదు. పైగా తన సత్తా చంద్రబాబుకు ప్రతి రోజూ గుర్తు రావాలని ప్రజావేదిక కూల్చివేత వ్యర్ధాలు ఇప్పటికీ అక్కడ నుండి తరలించలేదు. అయితే ఆ వ్యర్ధాలను చూసినప్పుడల్లా చంద్రబాబు ఏమనుకుంటున్నారో తెలీదుగానీ ప్రజలు మాత్రం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు.

“అక్రమమో సక్రమమమో నిర్మాణమైతే చేశారు. ఇప్పుడు అదే ప్రజావేదిక ఉంటే కనీసం ఒక క్వారంటైన్ సెంటర్ గానైనా ఉపయోగపడేది. కరోనా మరింత ముదిరితే టెంపరరీ ఆసుపత్రిగా మార్చుకునే అవకాశమైనా ఉండేది. పడగొట్టి ఏం సాధించారో తెలీదు,” అంటూ అటుగా వెళ్తూ ఆ వ్యర్ధాలను చూసిన ప్రతివారు అనుకుంటున్నారు.

ఆ ప్రజావేదిక కు కొంచెం దూరంలో కృష్ణా నది కరకట్ట మీద గణపతి సచ్చిదానంద ఆశ్రమం, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, బీజేపీ మాజీ ఎంపీ గెస్ట్ హౌస్ వంటి అక్రమ కట్టడాలు ఇప్పటికి కూడా అలాగే ఉండడంతో ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో తేలిపోయిందని అక్కడే ఒక నిర్ధారణకు వస్తున్నారు.