High Court of andhra Pradesh - Jaganవిద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు అర్ధంతరంగా ఉద్వాసన పలకడం వరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి‌ సర్కారు తీసుకున్న అనేక చర్యలను… చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

మొన్న ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ హై కోర్టులోని పలువురు జడ్జీలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాశారు. అయితే దానిని ప్రధాన న్యాయమూర్తి పట్టించుకున్నట్టుగా లేదు. అయితే ఈ విషయంలో కేంద్రం కలగజేసుకుని జగన్ కు మద్దతు ఇచ్చిన్నట్టుగా కనిపిస్తుంది.

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను.. మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం తీర్మానించినట్లు సమాచారం.

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరుణ్‌కుమార్‌ గోస్వామిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా గోస్వామి ఉన్నారు. సరిగ్గా ఇదే సమయానికి ఢిల్లీ రావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ కు పిలుపు రావడం గమనార్హం. ఇకనైనా హై కోర్టు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఆనందపడుతున్నారు.