అమరావతి లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి 3,000 కోట్ల రుణాలకు బ్యాంక్ గారంటీ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఉన్నఫలంగా అమరావతిలో ని బిల్డింగులను ప్రభుత్వం ఎందుకు పూర్తి చెయ్యాలని అనుకుంటుంది అనేదాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే నెలలో అమరావతి ప్రాంతంలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అయితే ఇది ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే అని, అమరావతి పట్ల జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ఏకంగా అమరావతి పేరుతో అప్పులు తెచ్చి ప్రజలని మభ్య పెట్టి ఆ తరువాత ఆ నిధిలను నవరత్నాలకు మళ్లిస్తారు అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక పర్యాయలలో జగన్ ప్రభుత్వం అనేక నిధులను ఇలాగే నవరత్నాలకు అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ప్రభుత్వం మళ్లించిన సంగతి తెలిసిందే.

మరోవైపు…జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు 435వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సమయంలో కొంత తగ్గిన ఉద్యమం ఆ తరువాత కేసులు తగ్గుముఖం పట్టింది అన్నాకా మళ్ళీ ఊపందుకుంది. మరోవైపు… అమరావతి రైతులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు మద్దతుగా కూడా అమరావతి రైతులు దీక్షలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.