పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ జగన్ ప్రభుత్వం బండారంసంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జగన్ ప్రభుత్వం తరచు చెబుతుంది. అయితే ఆ లెక్కలు పార్లమెంట్ సాక్షిగా అబద్దమని తేలిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రకు 78,276 ఇళ్లు కేటాయిస్తే.. 2016-19 మధ్యలో అంటే చంద్రబాబు హయాంలో అందులో 46,723 ఇళ్లు కట్టారు

అదే గత రెండేళ్లలో ఆంద్రలో ఒక్క ఇల్లూ కట్టలేదు అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. అయితే మంజూరు చేసిన ఇళ్లులు పూర్తి కాకుండా కొత్తవి ఇచ్చే అవకాశం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దానితో జగన్ హయాంలో పేదలు నష్టపోతున్నారని స్పష్టం అవుతుంది.

“ఇళ్లేంటి? .. ఎక్కడా ఒక్క ఇటుక వెయ్యలా, బొచ్చె సిమెంట్ వెయ్యలా .. తట్ట మట్టి తోడలా… అది పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్దత,” అని తెలుగుదేశం నాయకులు ఆక్షేపిస్తున్నారు. కొత్త ఇళ్ల సంగతి అటుంచితే చంద్రబాబు హయాంలో పూర్తయిన చాలా ఇల్లులు ఇప్పటివరకు లబ్దిదారులకు ఇవ్వలేదు.

“వాటిని ఇస్తే ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని ఈ ప్రభుత్వానికి కడుపు మంట. అటు చేసి ఇటు చేసి నష్టపోయేది ఎవరు అంటే… పేద ప్రజలు,” అని ప్రధానప్రతిపక్షం ఆరోపిస్తుంది. దీనికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.