AP government targeting former Union Minister Ashok Gajapati Raju అధికారంలోకి వచ్చిన నాటి నుండీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుని టార్గెట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకానొక రోజు ఉన్నఫళంగా అశోక్ అన్న కుమార్తె (విడాకులు తీసుకున్న భార్యకు చెందిన కుమార్తె) ను తీసుకుని వచ్చి మాన్సాస్ ట్రస్ట్ పగ్గాలు అప్పజెప్పారు.

సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం అశోక్ మళ్ళీ ట్రస్ట్ బాధ్యతలు తిరిగి తెచ్చుకున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా పట్టువదలక అశోక్ ని దించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేనట్టుగా పదహారు నెలల పాటు తమకు జీతాలు ఇవ్వడం లేదని సిబ్బంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేకపోవడాన్ని బట్టే కొత్త నాయకత్వం ఎలా పనిచేసింది అనే దానికి నిదర్శనం అని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం చే నియమింపడిన ఈవో ద్వారా ట్రస్ట్ మీద పట్టు సాధించలేని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో ఇంకా వేరే మార్గం లేక ట్రస్ట్ ఈఓ సహకరించడం లేదని అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని పిటిషన్ వేశారు. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది.సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. అశోక్ ని సాధిస్తున్నాం అనుకుని ఆ ప్రక్రియలో ట్రస్ట్ సిబ్బందిని, ట్రస్ట్ మీద ఆధారపడిన విద్యార్థులను ఇతరులను ఇబ్బంది పెట్టడం లో అధికార పార్టీకి ఎటువంటి లబ్ది ఉంటుందో వారికే తెలియాలి. వారంతా కూడా ఓటర్లే కదా?

ఆ లెక్కలు కూడా పక్కన పెడితే ఇప్పుడు హైకోర్టులో పరాభవం కూడా తప్పకపోవచ్చు.