AP government Property registration values ఇప్పటికే అనేక రూపాలలో ప్రజల నుండి వివిధ రకాల పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి మరికొన్ని కొత్త పన్నులను వసూలు చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇందులో కరెంట్ చార్జీలు అంశం ఇప్పటికే హైలైట్ కాగా, తాజాగా ఆస్తి రిజిస్ట్రేషన్ విలువలను పెంచే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 25వ తేదీ లోపున మార్కెట్ విలువ సవరణలను సిద్ధం చేయాల్సిందిగా జగన్ సర్కార్ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

వాటి మీద అభ్యంతరాలను పరిశీలించడం, వాటికి పరిష్కారం చూపించడం వంటి కార్యక్రమాలను వచ్చే నెల 7వ తేదీన పూర్తి చేసే విధంగా ఆదేశాలు వెళ్లాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైన నేపధ్యంలో, కొత్తగా ఆస్తి విలువలను పెంపు అనేది మరో రూపంలో సామాన్యుడి నెత్తిపై భారం మోపినట్లే.

ఇక ఈ విలువలను పెంచే ప్రక్రియకు అధికారులకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా రెండు రోజుల్లో సిద్ధం చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు వెళ్లడంతో, గ్రౌండ్ వర్క్ లేకుండానే ప్రస్తుతం ఉన్న విలువలకు కొంత శాతాన్ని జోడించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పనిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నట్లుగా మీడియా వర్గాల సమాచారం.