AP government on corona virus vaccinationదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. అయితే ఈ ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా ఆయా వ్యక్తులు భరించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

మరోవైపు… రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసే రేట్లు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వానికి ఇచ్చే రేట్లకంటే ఎక్కువ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. కేంద్ర నిర్ణయంతో ఏపీపై భారీగా ఆర్ధిక భారం పడుతుందని, సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల ఆర్ధిక భారం పడుతుందని ఆర్ధిక శాఖ అంచనా వేస్తుంది.

ఇప్పటికే తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పెనుభారమని…కేంద్రం తీరుపై ఏపీ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి తో ఉందని అనుకూల మీడియాలో లీకులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

“దేశంలోనే అత్యంత దుబారా చేసే ప్రభుత్వాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రభుత్వ బిల్డింగ్లకు రంగులు అంటూ దాదాపుగా 3,000 కోట్లు తగలేశారు. ప్రజారోగ్యానికి 1500-2000 కోట్లు పెద్ద మొత్తం ఏమీ కాదు. ఐనా మీకు అప్పులు కొత్తమీ కాదు కదా,” అంటూ అనేక విమర్శలు వస్తున్నాయి.