AP Election Commissioner Gopala Krishna Diwediఎన్నికల హడావిడి నడుస్తుండగా రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వ్యక్తిగత కారణాలతో ఐదు రోజులు సెలవు పై వెళ్లారు. సహజంగా కౌంటింగ్ ముగిసేవరకూ మొత్తం వ్యవహారం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇటువంటి సమయంలో సెలవులు పెట్టడం ఆశ్చర్యకరం అనే చెప్పుకోవాలి. అయితే ఆయన లేని సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్లలో రిపోలింగ్ లో ఆదేశించింది. పోలింగ్ పూర్తయిన 34 రోజుల తరువాత రిపోలింగ్ కు ఆదేశించడం చరిత్రలో బహుశా ఇదే మొదటి సారి.

ఇక్కడ పోలింగ్ తీరుపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు కానీ.. రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ ఫిర్యాదు చేయలేదు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి పోలింగ్ ఐన చాలా రోజులకు లెక్కలు వేసుకుని ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఎన్నికల ప్రక్రియతో ఏ మాత్రం సంబంధం లేని చీఫ్ సెక్రటరీ మద్దతుగా ఎన్నికల సంఘానికి లేఖ రాయడం విడ్డూరం. సంబంధిత కమిటి నివేదిక రాకుండానే దానికి అనుగుణంగా నివేదికలు తెప్పించుకుని.. రీపోలింగ్ కు ఆదేశించేసింది ఎన్నికల సంఘం.

ఆంధ్రప్రదేశ్ విషయంలో మొదటి నుండీ ఎన్నికల సంఘం తీరు విమర్శల పాలు అవుతూనే ఉంది. చంద్రగిరిలో ఎందుకు రిపోలింగ్ పెట్టారని కానీ, టీడీపీ బలంగా ఉండే పల్లెలలోనే రీపొలింగ్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఎందుకు ఈసీ సంప్రదాయాలు పాటించలేదనే ప్రశ్నలకు ఎన్నికల సంఘం వద్ద జవాబు లేకపోవడం విశేషం. వీటి నుండి తప్పించుకోవడానికే రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హడావిడిగా సెలవు మీద వెళ్లినట్టు టీడీపీ నాయకుల అనుమానం.