ఈసీ అప్పుడు చెప్పింది అబద్దమా లేదా ఇప్పుడు చేస్తున్నది తప్పా?

AP Election Commissioner Gopala Krishna Diwediఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించిన సంగతి తెలిసిందే. వివిధ కేంద్రాల్లో కనిష్ఠంగా 45 నిమిషాలు నుంచి గరిష్ఠంగా 7 గంటల వరకూ ఈవీఎంలు పనిచేయలేదు. దీనివల్ల చాలా చోట్ల మరునాడు తెల్లవారాక కూడా పోలింగ్ జరపాల్సి వచ్చింది. అయితే ఎన్నికల సంఘం ఈ విషయాన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏపీలో 92 వేల ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించగా, 381 ఈవీఎంల్లోనే సమస్యలు వచ్చాయి.

మొత్తం ఈవీఎంల్లో ఇది 0.03 శాతం మాత్రమే అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా సీఈసీ సునీల్‌ అరోడా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చిందని చెప్పడం విశేషం. అయితే ఇప్పుడు ఉన్నఫళంగా చర్యలు అంటూ హడావిడి చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 6 అధికారులపై తక్షణ చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై చార్జెస్‌ ఫ్రేమ్‌కు ఆదేశించింది. ఏఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సస్పెండ్‌ చేసింది. ఒకవేళ ముందు ఎన్నికల సంఘం అన్నట్టు అసలు తప్పు జరగలేదంటే ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకుంటున్నట్టు? అంటే ఎన్నికల సంఘం అప్పుడు చెప్పింది అబద్దమా లేదా ఇప్పుడు చేస్తున్నది తప్పా? మాది రాజ్యాంగ సంస్థ మమల్ని ప్రశ్నించకూడదు అంటే నష్టం ఎన్నికల సంఘానికే

Follow @mirchi9 for more User Comments
Ala Vaikunthapurramuloo TeaserDon't MissTeaser Talk: A Typical Trivikram Entertainer For Festival CrowdThe teaser of Stylish Star Allu Arjun’s upcoming film Ala Vaikunthapurramulo is out. After the...tammineni-sitaram-chandrababu-naidu-controversyDon't Missచంద్రబాబుని సస్పెండ్ చెయ్యాలంటూ డిమాండ్ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు విషయాలకంటే అనవసరపు రాద్ధాంతం ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఉంది. ప్రతిపక్షంపై ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా పాఠశాలల్లో...Aswathama Picks A Tough BattleDon't MissAswathama Picks A Tough BattleAswathama is the upcoming film of young actor Naga Shaurya. The first looks poster of...Nara Lokesh Strong Rebuttal About Ruling Party Targeting HimDon't MissLokesh's Strong Rebuttal About Ruling Party Targeting HimFormer Minister Nara Lokesh had given a strong rebuttal to the Ruling Party's Criticism about...15 Crore to Boyapati - From Where?Don't Miss15 Crore to Boyapati - From Where?Balayya's next movie with Boyapati Srinu was launched recently. No doubt, the combination has its...
Mirchi9