Telugu

హైకోర్టుకు చేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పేరు వివాదం

Share

వైఎస్సార్ కాంగ్రెస్ లో రెబెల్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు రగిల్చిన చిచ్చు కొత్త తలపోటు తెచ్చిపెడుతుంది. గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.

జగన్ మోహన్ రెడ్డి కు చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… వైఎస్సార్ కాంగ్రెస్ అనే పేరు వాడుకోకూడదని గతంలోనే ఎన్నికల సంఘం నిర్దిష్టమైన నిబంధనలను ఆ పార్టీ దృష్టికి తెచ్చినా పట్టించుకోవట్లేదని అన్నా వైఎస్ఆర్ పార్టీ పిటిషన్ లో ఆరోపించింది.

ఈ విషయంగా ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టులు ఎలా స్పందిస్తాయో అదే సమయంలో ఎన్నికల సమాధానం ఏమని అంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. రఘు రామ కృష్ణం రాజుకు ఇచ్చిన షో కాజ్ నోటీసు మీద వైఎస్సార్ కాంగ్రెస్ అని రాయకూడదని ఆయన ఈ విషయాన్ని తెరమీదకు తెచ్చారు.

ఇది ఇలా ఉండగా…. అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా వెనుక రఘురామ కృష్ణం రాజే ఉండి ఇవ్వన్నీ చేయిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించడానికి ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.