Andhra-Pradesh-Announces-Lockdown,-Exams-To-Go-As-Plannedకరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లినా మనిషికి, మనిషికి మధ్య 2 ఫీట్ల దూరం పాటించాలన్నారు.

ఈ లాక్ డౌన్ సమయంలో పనులు లేక ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నందున తెల్లరేషన్‌కార్డుదారులకు ఇచ్చే రేషన్ ఈ నెల 29కే అందేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఈ సారి బియ్యంతో ప్రతి కార్డుకి ఒక కేజీ పప్పు కూడా ఇస్తామని చెప్పారు. సరుకుల కోసం రూ. 1000 ఇస్తామని చెప్పారు.

దీనికోసం ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు చెయ్యబోతుంది అన్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ… పదవ తరగతి తో పాటు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన మిగిలిన పరీక్షలు యధావిధిగా సాగుతాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం చాలా ప్రమాదకరం. కరోనా ప్రబలే అవకాశం ఉండటంతో పాటు, రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఇదే విషయాన్నీ ప్రెస్ మీట్ కు హాజరైన ఒక విలేఖరి ప్రశ్నించగా… జగన్ సమాధానం దాటవేశారు. మిగిలిన విషయాలు వీళ్ళు చెబుతారు అంటూ చీఫ్ సెక్రటరీని చూబిస్తూ వెళ్లిపోయారు. అప్పటికీ ప్రెస్ మీట్ కు ప్రభుత్వానికి అనుకూలమైన మీడియాలనే పిలిచినట్టు ప్రచారం జరుగుతుంది.