AP CID case on Chandrababu Naiduహైదరాబాద్‍లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం చేరుకున్నారు. అమరావతి పై తాజాగా నమోదైన కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. రాజధానిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కంప్లయింట్ పై కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణను ముద్దాయిలుగా చేర్చారు.

41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి తమ ముందు హాజరు కావాలని నోటీసులలో పేర్కొనట్టు సమాచారం. ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీ మిర్చి9 వద్ద ఉంది. గత నెల 24న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్ లో తన వద్దకు కొందరు ఎస్సీ, ఎస్టీ రైతులు తమను గత ప్రభుత్వంలో మోసం చేసి తమ భూములు లాక్కున్నారని, తమకు నష్టం చేకూర్చారని తెలిపారని, ఇందులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ నింధితులుగా పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ లో ఎక్కడా మోసపోయారు అని చెప్పబడుతున్న రైతుల పేర్లు చేర్చకపోవడం గమనార్హం. అసలు మోసం ఎలా జరిగింది, ఎవరు మోసపోయారు, ఎంత నష్టపోయారు, అనే వివరాలు లేకుండా ఉన్న ఈ కేసు రాజకీయ దురుదేశం తో పెట్టిందనిగా కోర్టు భవించవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. పైగా అధికార పార్టీ కంప్లయింట్ ఇవ్వడం ద్వారా అది తేటతెల్లం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన నోటీసులు అందుకోవడానికి హైదరాబాద్‌లో లేరు. ఈ నెల 23న విచారణకు రావాలని నారాయణకు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. చంద్రబాబు నోటీసులలో సమయం ఎప్పుడు ఇచ్చింది తెలియ రాలేదు. అయితే ఈ విషయంపై చంద్రబాబు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది.