AP Cabinet Meetingఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో రెండు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

1.కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. 2. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ అధీనంలో నడుస్తున్న 2,114 పాఠశాలలను విద్యాశాఖకు బదిలీ చేసింది.

కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ పేరు జోడించడాన్ని నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన అమలాపురంలో అల్లర్లు జరగడం, దానిలో నిరసనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు నిప్పు పెట్టడంవంటి అవాంఛనీయ ఘటనలు జరిగాయి. నేటికీ ఆ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ నేపద్యంలో ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంతో మళ్ళీ కోనసీమలో ఏమి జరుగుతుందో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి.

రాష్ట్రంలో మున్సిపల్ స్కూళ్ళలో హైస్కూల్స్ 345, ప్రాధమికోన్నత పాఠశాలలు 149, ప్రాధమిక పాఠశాలలు 1,620 ఉన్నాయి. ఇక నుంచి ఇవన్నీ విద్యాశాఖ అధీనంలో పనిచేస్తాయి. అయితే ఆయా పాఠశాలల ఆస్తులు మాత్రం మున్సిపల్ శాఖ ఆధీనంలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించేందుకు చేస్తున్న ఇటువంటి ప్రయోగాల వలన విద్యావ్యవస్థ దెబ్బ తింటుందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనుక ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు ఏవిదంగా స్పందిస్తాయో చూడాలి.