AP BJP Vice President Vishnuvardhan Reddy home quarantine notice (1)బీజేపీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటారు. ఆయన కర్నూలు జిల్లాకు వెళ్లి వచ్చారు. దీనితో స్థానిక పోలీసులు ఆయన 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని నోటీసులు అంటించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపింది.

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు లాక్ డౌన్ రూల్స్ ని పక్కనపెట్టి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆ పార్టీ నెంబర్ 2, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రోజుకో జిల్లాలో ఉంటున్నారు. సభలు, సమావేశాలు పెట్టి సాంఘిక దూరం అనేది పాటించకుండా చెలరేగిపోతున్నారు. అయినా అడిగే వాడు… ఆపే వాడూ లేడు.

వైఎస్సార్ కాంగ్రెస్ వారు చేసే పనులు పోలీసుల కళ్లకు కనిపించడం లేదా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా అంటూ ఆక్షేపించారు. అటు వైసీపీ నేతలైనా, ఇటు బీజేపీ నేతలైనా తమలో ఎవరికైనా కరోనా వచ్చే అవకాశం ఉంటుందని, జాగ్రత్తగా ఉంటే తమకూ, ప్రజలకూ మంచిదని తెలుసుకుంటే మంచిది.

గత 24 గంటల్లో 61 కొత్త కేసులతో రాష్ట్రంలోని మొత్తం 1016 కేసులకు చేరుకున్నాయి. దేశంలో 1000 కేసులను దాటిన ఎనిమిదో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మూడు బ్యాక్ టు బ్యాక్ రోజుల పాటు రాష్ట్రంలో యాబైకు పైగా కేసులు వచ్చాయి. రెండు కొత్త మరణాలు కూడా సంభవించాయి. 31 మంది చనిపోవడం, 171 మంది డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో 814 క్రియాశీల కేసులు ఉన్నాయి.