anushka size zero to compete with kumari 21fఅనుష్క హీరోయిన్‌గా తెరకెక్కిన ‘సైజ్‌ జీరో’ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను ఈనెల 27న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తమిళంలో ఈ సినిమాకు పెద్దగా పోటీ లేదు. కాని తెలుగులో మాత్రం ఈ సినిమా ‘కుమారి 21ఎఫ్‌’ నుండి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రం భారీ కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకు పోతుంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే కుమారి క్రేజ్‌ తగ్గుతుందని భావించారు. కాని వర్కింగ్‌ డేస్‌ అయినా సోమ, మంగళ వారాల్లో కూడా కుమారి దుమ్ము రేపే కలెక్షన్స్‌ను దక్కించుకుంటుంది. యూత్‌ ఆడియన్స్‌ థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘సైజ్‌ జీరో’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆధరిస్తారా అనేది కాస్త అనుమానంగా ఉంది. ఒక వేళ ‘సైజ్‌ జీరో’ ఫలితం అటు ఇటు అయితే అప్పుడు కుమారి ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కుమారిని తట్టుకుని అనుష్క నిలిచేనా చూడాలి.