Anushka- Shettyఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదల చెయ్యబోతున్నాం అని నిర్మాతలు అప్పట్లో ప్రకటించారు.

అయితే ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి కానీ నిర్మాతల వైపు నుండి ఎటువంటి మాట లేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో అనుష్క చిన్న గెస్ట్ రోల్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజం కాదని తెలుస్తుంది. “అనుష్క ఈ సినిమాలో నటించడం లేదు. అసలు ఈ సినిమాలో ఎటువంటి గెస్ట్ రోల్ కు ఆస్కారం లేదు,” అని చిత్రానికి సంబంధించిన వారు అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రలో ఎవరు చెయ్యబోతున్నారు అనేది ఇంకా చెప్పలేదు.

ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈరోజు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యబోతున్నారని వార్తలు వస్తున్నాయి.