Anushka Shetty Nishabdhamస్వీటీ అనుష్క యొక్క నిశ్శబ్దం తన థియేట్రికల్ విడుదలను రద్దు చేసుకుని… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 2 న గాంధీ జయంతి స్పెషల్ గా విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో స్ట్రీమ్ కానుంది. ఆ;ఏజ్ మలయాళం డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంటుంది.

అమెజాన్ యొక్క మునుపటి ప్రత్యేక విడుదలల మాదిరిగా కాకుండా, నిశ్శబ్దం అమెజాన్ ఒరిజినల్‌ అంటూ అమెజాన్ చెబుతుంది. సాధారణంగా, అమెజాన్ ఒరిజినల్స్ అనేది అమెజాన్ చేత మొదటి నుండీ చివరి దాకా నిర్మించిన సినిమాలు. బయట నుండి కొన్న సినిమాలను అమెజాన్ ఒరిజినల్ అనరు. అయితే నిశ్శబ్డం అలా కాదు కదా.

కానీ అమెజాన్ ఒరిజినల్ అనడానికి కారణం ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే లభిస్తుంది. ఈ చిత్రానికి టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉండదు. చిత్రం యొక్క సంపూర్ణ హక్కులు అమెజాన్ వే. అందుకే అమెజాన్ ఒరిజినల్ అంటున్నారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మాధవన్ హీరోగా కనిపించనున్నాడు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్మొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.