anushka-shetty-in-manchu-lakshmi-memu-saithamఅందాల బొమ్మ అనుష్కకు వీరాభిమానులా? స్వీటీ అంటే పడిచచ్చిపోయేవాళ్ళా? ఆమెను కనీసం ఒక్కసారైనా కలవాలని భావిస్తున్నారా? అయితే అలాంటి అవకాశాన్ని మంచు లక్ష్మీ కల్పిస్తోంది. ‘మేము సైతం’ సీజన్ 2 ను హీరోయిన్ అనుష్క చేత మంచు వారమ్మాయి ప్రారంభించబోతోంది. దీంతో సోషల్ మీడియాలో సదరు సమాచారాన్ని పోస్ట్ చేసింది.

హైదరాబాద్, ఫిల్మ్ నగర్, రోడ్ నంబర్ 1లో ఉన్న పెట్రోలు బంకులో ఈ ఆదివారం ఉదయం 10 గంటల నుండి అనుష్క పెట్రోల్ కొట్టనుంది. దీంతో అనుష్క చేత పెట్రోల్ కొట్టించుకోవాలనుకునే వారంతా సదరు పెట్రోల్ బంకుకు క్యూ కట్టమని పిలుపునిచ్చారు. సెలబ్రిటీలతో ఏదొక పని చేయించి, వారి అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కుటుంబాన్ని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్న సంగతి తెలిసిందే.