Anushka Shetty Director Singeetham Srinivas Bangalore Nagarathnamma biopicఆదిత్య 369, భైరవద్వీపం వంటి ఎన్నో వినూతనమైన సినిమాలకు దర్శకత్వం వహించారు సింగీతం శ్రీనివాస రావు. చివరిగా 2013లో వెల్కమ్ ఒబామా అనే సినిమాకు 80 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన 88 ఏళ్ల వయసులో ఇంకో సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

88 ఏళ్ల వయసులో సింగీతం ఇప్పుడు మరో సినిమాకు డైరెక్ట్ చేయడం నిజంగా అద్భుతమే. స్వాతంత్య్రం ముందు కర్ణాటక కు చెందిన ఒక లెజండరీ సింగర్, నగరత్తమ్మ బయోపిక్ ను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నారు ఆయన. అది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు నడుస్తున్నట్లు భోగట్టా.

ఈ సినిమా కోసం అనుష్కని హీరోయిన్ గా అనుకుంటున్నారట. అనుష్క దక్షిణాదిన అంతా ఫేమస్ హీరోయిన్. బాలీవుడ్ లో కూడా సుపరిచితమే. దీనితో ఆమె హీరోయిన్ అయితే బెటర్ అని అనుకుంటున్నారు. దీనికి అనుష్క ఏం అంటుందో చూడాలి. ఆమె ఈ మధ్య కాలంలో చాలా సెలెక్టివ్ గా మారిపోయింది.

ఈ మధ్య టాలీవుడ్ లో బాగా యాక్టీవ్ గా ఉంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సింగీతానికి హెల్ప్ చెయ్యడానికి ఇద్దరు అసిస్టెంట్లు ఉండబోతున్నారట. వారు ఆయనకు సాయంగా ఉంటారు షూటింగ్ లో. అనుష్క ప్రస్తుతం తన సైలెంట్ థ్రిల్లర్ నిశ్శబ్దం విడుదల కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ భయంతో వాయిదా పడింది.