మీడియా లోని ఒక సెక్షన్ కు చాలా ఇష్టమైన అంశాలలో ఒకటి… అనుష్క వివాహం. ప్రతిసారీ, నటిని ఎవరో ఒకరితో ముడి పెట్టి దానితో పుంకానుపుంఖాలుగా కథనాలను ప్రచురించేది. తాజాగా తన పెళ్లి పై నటి మరోసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. దానిలో కూడా పెళ్లి ఎప్పుడు అనేదాని మీద క్లారిటీ ఇవ్వలేదు.
“నేను 14 సంవత్సరాలలో చాలా బిజీగా గడిపాను. ఇన్నేళ్ళుగా నేను ఇంట్లో సమయం గడపడం చాలా కష్టం అయ్యింది. నా జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తులతో కూడా గడపడానికి నాకు తగినంత సమయం లభించలేదు. ఈ లాక్డౌన్లో నేను దాని కోసం ప్రయత్నిస్తున్నాను,” దానితో తాను పెళ్లి కోసం కంగారుగా లేనని ఈ నటి చెప్పకనే చెప్పింది.
Also Read – మనోజ్ ‘మంచు’ ని కరిగిస్తారా.? కాపాడతారా.?
ఇది ఇలా ఉండగా… అనుష్క యొక్క సైలెంట్ థ్రిల్లర్, నిశ్శబ్దం దాని థియేట్రికల్ విడుదలను స్కిప్ చేసి… నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల అవుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో గాంధీ జయంతి స్పెషల్ గా స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో… అలాగే మలయాళం డబ్బింగ్ లో కూడా విడుదలవుతోంది.
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం ఒక సైలెంట్ థ్రిల్లర్. ఈ చిత్రంలో నటి మూగ ఆర్టిస్ట్, సాక్షిగా కనిపిస్తుంది అనుష్క. నిశ్శబ్దంలో మాధవన్, అంజలి, షాలిని పాండే కూడా ఉన్నారు. గోపి సుందర్ సంగీతం సమకూర్చగా, గిరీష్ జి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.
Also Read – అధికారం కోసం చిచ్చు పెట్టడం నైతికమేనా… ఏ-1, ఏ-2?