anushka shetty chiranjeeviతెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకున్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలిసిందే. ‘కత్తి’ రీమేక్ ను దర్శకుడు వివి వినాయక్ కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కించబోతున్నారు అన్న విషయం తప్ప, ఎలాంటి ఇతర సమాచారం లేని ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ ఎంపిక కోసం తీవ్ర కసరత్తులు జరిగాయని, చివరగా ‘బొమ్మాళి’ అనుష్కను ఎంపిక అయినట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ, తాజా సమాచారం మేరకు మెగాస్టార్ ‘మెగా’ మూవీకి అనుష్క రెడ్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇప్పటికే ‘బాహుబలి, భాగమతి, ఓంనమో వేంకటేశాయ, సింగం 3’ సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క తన డేట్లను సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో, ఈ సినిమాను చేయలేనని చెప్పినట్లుగా సినీ వర్గాల టాక్. దీంతో అనుష్క ఇచ్చిన షాక్ నుండి తేరుకుని మరో ముద్దుగుమ్మ కోసం చిత్ర యూనిట్ అన్వేషించాల్సి వస్తోందని సమాచారం.

అప్పటి అగ్ర హీరోలకు నటీమణులను ఎంపిక చేయడం ప్రస్తుతం తలకు మించిన భారంగా మారుతోంది. మొన్నటివరకు ఇలాంటి అనుభూతులనే బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు చవిచూడగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలిసి వస్తోంది. మరి ఫైనల్ గా ఎవరు తెరపైకి వస్తారో… మెగాస్టార్ మెగా మూవీకి హీరోయిన్ కష్టాలు ఎప్పుడు తీరతాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.