Anupama-Parameswaranమెగా హీరో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన “తేజ్ ఐ లవ్ యూ” సినిమా జూలై 6వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం పబ్లిసిటీపై దృష్టి పెట్టిన చిత్ర యూనిట్, సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమోలను రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా ‘నా చుట్టూ ఉన్నదే’ అనే వీడియో ప్రోమోను గురువారం నాడు సాయంత్రం విడుదల చేయనున్నట్లు హీరో సాయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

అమ్మాయి వెంటపడి హీరో టీజ్ చేసే సాంగ్స్ చాలా వచ్చాయి… కానీ హీరోయిన్ అనుపమ తనను టీజ్ చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ పాటలో ఉంటుందని సాయి తెలుపగా, దీనికి ‘నేను అలా చేయను, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్’ అంటూ రిప్లై ఇచ్చింది. మళ్ళీ సాయి ‘కరెక్ట్ మీరు టీజ్ చేయలేదు, టార్చర్ చేసారు’ అంటూ ప్రతిస్పందించారు. హీరో – హీరోయిన్ల మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా పబ్లిసిటీయే కదా!