anupama-chopra shocked with ram-gopal-varma-replyసోషల్ మీడియా మాంత్రికుడు రాంగోపాల్ వర్మ పేరు మరోసారి మారుమ్రోగుతోంది. ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించే వర్మ, తాజాగా ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రాకు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత విధూ వినోద్ చోప్రా సతీమణి అయిన అనుపమ ఓ వెబ్ సైట్ ను రన్ చేస్తున్న నేపధ్యంలో… వర్మ సాయం కోరింది.

మీరు తీసిన క్లాసిక్స్ సత్య, కంపెనీ తరహా సినిమాల స్క్రిప్ట్ లు ఇస్తే తన వెబ్ సైట్ లో పెడతానని, అవి సినీ రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయని అడుగగా, ఆమెకు దిమ్మతిరిగే సమాధానాన్ని ఇచ్చాడు. నిజానికి ఆ రెండు సినిమాలకు స్క్రిప్ట్ లేదని, ఆసక్తి ఉన్న వారికి ఆ సినిమాలు చూసి స్క్రిప్ట్ రాసుకోమని చెప్పమని అవాక్కయ్యే జవాబు ఇచ్చారు.

తన తల్లి మీద మరియు స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద ఒట్టేసి చెప్తున్నాను… తాను బౌండెడ్ స్క్రిప్ట్ లతో వెళ్ళినపుడే తనకు ఫ్లాపులు ప్రారంభమయ్యాయని బదులిచ్చాడు. వర్మ నుండి వచ్చిన స్పందనకు అవాక్కైన అనుపమ చోప్రా దానిని సోషల్ మీడియాలో ‘వర్మ క్లాసిక్’ అంటూ పోస్ట్ చేయడంతో… అది కాస్త వైరల్ అయ్యింది. వర్మ ఏం చేసినా, అది హాట్ టాపిక్ కాకుండా ఎలా ఉంటుందిలేండి!