Anu malik పలు సూపర్ హిట్ హిందీ చిత్రాలకు సంగీతాన్ని అందించిన బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అను మాలిక్ పైనా కూడా తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇండియన్ ఐడల్ రియాల్టీ షో 5వ విడత జరుగుతున్న రోజుల్లో మాలిక్ తనను వేధించాడని డేనికా డిసౌజా అనే యువతి ఆరోపించింది.

ఇండియన్ ఐడల్ ను నిర్వహిస్తున్న సంస్థలో పనిచేసిన డేనికా, తనపై తరచూ వేధింపులు జరిగాయని, అక్కడి పెద్దలకు ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదని ఆరోపించింది. డేనికా ఆరోపణలతో తాజా ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్ ను తప్పించే యోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను అనూ మాలిక్ ఖండించాడు. తాను ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశాడు.