Anu-Emmanuel--Latest-Selfie‘మజ్ను’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అను ఇమ్మానుయేల్, ఆ తర్వాత రాజ్ తరుణ్ సరసన నటించి హిట్ కొట్టింది. ఏకంగా పవర్ స్టార్ సరసన ‘అజ్ఞాతవాసి’లో ఛాన్స్ కొట్టి టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన ఈ బ్యూటీ, సమ్మర్ లో సిద్ధం కాబోతోన్న ‘నా పేరు సూర్య’లో అల్లు అర్జున్ సరసన కనువిందు చేయనున్న విషయం తెలిసిందే. అలాగే మారుతీ – చైతూ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ, గత రెండు రోజులుగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

తాజాగా ఈ వీకెండ్ లో ఓ హాట్ సెల్ఫీతో నెటిజన్లను పలకరించింది. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో సెల్ఫీలో ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ దిగిన ఫోటోకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. బహుశా మే మొదటి వారంలో విడుదల కాబోతున్న తన సినిమాకు సంబంధించి తాను హైలైట్ కావడానికి ఇప్పట్నుంచే బ్యాక్ గ్రౌండ్ రెడీ చేసుకుంటుందో ఏమో గానీ, గత రెండు రెండు రోజులుగా తన హాట్ ఫోటోలతో వీక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. బహుశా తన ‘మజ్ను’ కోసం చేస్తోన్న అన్వేషణలో భాగమేమో..!