antariksham-9000-kmph-vs-mission-mangalటాలీవుడ్ సినిమా రూపు మారుతుంది. ఒక పక్క పక్కా కమర్షియల్ ఫార్మ్యాట్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్న దర్శకులు ఉన్నారు, మరో పక్క మాస్ సీనియాలనే ఎంచుకుని ముందుకు సాగే దర్శకులు ఉన్నారు. అయితే వీరిలా కాకుండా కొత్తగా, హాలీవుడ్ లెవెల్ సినిమాలు తీసి తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని పరితపించే దర్శకులు కొత్తగా పుట్టుకొస్తున్నారు. అయితే అలాంటి వారిలో ‘ఘాజీ’ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఒకరు.

ఘాజీ సినిమాతో భారత చలన చిత్ర చరిత్రలో తొలి సబ్‌మెరైన్ సినిమాను రూపొందించిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు మెగా హీరో వరుణ్ తెజ్ తో ‘అంతరిక్షం’ అనే సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా యూనిట్ చెబుతున్న ప్రమోషన్ ప్రకారం ఈ సినిమానే మన భారత దేశ చరిత్రలో తొలి స్పేస్ మూవీ. అయితే అదేంటి ఈ మద్యనే టిక్…టిక్…టిక్.. అని ఒక సినిమా వచ్చింది కదా అంటే, హా రావడం అయితే వచ్చింది కానీ, ఆ సినిమా క్వాలిటీ పరంగా, బడ్జెట్ పరంగా ఎక్కడికక్కడ కాంప్రమైస్ అయ్యీపోవడంతో ఔట్ పుట్ అటకెక్కింది. సరే ఆ సినిమాను పక్కన పెట్టేస్తే ఎవరు చెప్పారు వరుణ్ నటిస్తున్న ‘అంతరిక్షం’ తొలి స్పేస్ మూవీ అని, కానే కాదు ‘మిషన్ మంగళ్’ తొలి సినిమా అని బాలీవుడ్ సినిమా ఒకటి తెరపైకి వచ్చి హంగామా చేస్తుంది. అసలు ఇంతకీ ఇందులో ఏ సినిమా ఫర్స్ట్ స్పేస్ మూవీ అవుతుంది అంటే…

సినిమా వర్గాల ప్రకారం ఖచ్చితంగా వరుణ్ సినిమా అనే చెప్పవచ్చు. ఎందుకంటే ‘మిషన్ మంగళ్’ సినిమాలో బడా స్టార్ట్స్ అయినటువంటి అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, విద్యా బాలన్. నిత్య మీనన్, సోనాక్షి సిన్హా ఇలా బడా తారాగణం ఉండి ఉండవచ్చు కానీ, ఆ సినిమా ఇంకా మొదలే కాలేదు. పైగా ఆ సినిమా కధపై కోర్ట్ లో పెద్ద గొడవే నడుస్తుంది. ఇక ఎంత భారీ ఎత్తున తీస్తున్నా, వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా వస్తుంది. మరి ఈ క్రమంలో మరో పక్క వరుణ్ ‘అంతరిక్షం’ షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటూ ముందుకు సాగుతుంది. ‘మిషన్ మంగళ్’ కన్నా ముందే ‘అంతరిక్షం’ తెరపైకి వస్తుంది. మరి అలాంటి క్రమంలో ఈ సినిమానే మొదటి సినిమా అవుతుంది కధ. అదీ ఇండియన్ ఫర్స్ట్ స్పేస్ మూవీ పేటెంట్ పై అల్లుకుంటున్న నీలి నీడలు.