Naga Chaitanya and Sai Pallavi Love Story శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినబడుతుంది. ఈ చిత్రం ఏఎన్నార్, నాగార్జున కు చెందిన హిట్ సినిమాల పాటలకు నాగచైతన్య స్టెప్స్ వెయ్యబోతున్నాడట.

ఒక విల్లెజ్ సంబరాలలో నేపథ్యంలో ఇది ఉండబోతుందట. గతంలో 100% లవ్, మనం సినిమాలలో నాగచైతన్య ఇలాగే డాన్స్ చేశాడు. ఈ వార్తతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ దాస్‌ నారంగ్‌, పీ రామ్‌ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సీహెచ్‌ పవన్‌ సంగీతమందిస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఈ మధ్యనే ఫిదాతో పెద్ద హిట్ ఇచ్చాడు. అలాగే నాగచైతన్య కూడా మజిలీ, వెంకీ మామ వంటి సినిమాలతో ఫామ్ లోనే ఉన్నాడు. ఇక యూత్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దీనితో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.

గతంలో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ఇద్దరి కొత్తవాళ్ళతో మొదలు పెట్టాడు. అయితే కొంత షూటింగ్ అయ్యాకా సినిమా మీద అనుమానాలు రావడంతో ఆపేశారు. ఆ హీరో హీరోయిన్లు సినిమాలలోకి రావడానికి ఇంకా రెడీగా లేరు అనే ఉద్దేశంతో ఆపేశారు. ఇప్పుడు అదే కథతో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా లవ్ స్టోరీ తీస్తున్నారు.