Another-Mega-Hero-Cameo-in-Chiranjeevi-GodFather-Movieమెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాథర్’ సినిమా రేపు విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్లు అద్భుతంగా జరుగుతున్నాయి. చిరంజీవి సైరా, ఆచార్య లాంటి ఫ్లాప్స్ తరువాత వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా బుకింగ్స్ అద్భుతంగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ గారు మాట్లాడుతూ.. తాను చిరంజీవి అభిమాని అని, చిన్నప్పటి నుండి చిరంజీవితో సినిమా తీయడం తన కల అని చెప్పారు. ‘గాడ్ ఫాథర్’ సినిమా చెయ్యడానికి ముఖ్య కారణం రాంచరణ్ అని, అయన చెప్పడం తో లూసిఫెర్ సినిమా హక్కులు కొన్నాను అని అన్నారు. ఇక ఈ ‘గాడ్ ఫాథర్’ సినిమా లో మూడు అద్భుతమైన సీన్స్ ఉన్నాయని, వాటిలో నటించిందెవరో ఇప్పుడు చెప్పాలని ఉన్నా..ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేయడానికి చెప్పకుండా వదిలేస్తున్నా అని అన్నారు.

నిర్మాత ఎన్.వి.ప్రసాద్ గారిచ్చిన ట్విస్ట్ కి మెగా అభిమానులు అప్పుడే ఊహించుకోవడం మొదలుపెట్టేసారు. అసలు ఆ మూడు సీన్లు ఏంటి? నటిస్తున్న మరో మెగా హీరో ఎవరు? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒరిజినల్ లో టోవినో థామస్ పోషించిన పాత్రే అయ్యి ఉంటుందని కొందరు అంటుంటే, ఈ సినిమా మొదలైనప్పుడే ఇందులో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడని వచ్చిన పుకార్లు నిజం అని కొందరు అంటున్నారు. మరి కొన్ని గంటల్లో ఆ సస్పెన్స్ వీడనుంది. మెగా ఫాన్స్ ఇప్పటికే సంబరాలు జరుపుకోడానికి సిద్ధమయ్యారు. సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందు ట్విస్ట్ ఇచ్చి, మెగా అభిమానులకు నిద్ర లేకుండా చేశారు న్యాయమా ఇది.