annabelle-2-teaserహాలీవుడ్ సూపర్ హిట్ హార్రర్ సినిమాలలో ‘అన్నాబెల్లె’ కూడా ఒకటి. ఒకప్పుడు సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ వస్తోంది. “అన్నాబెల్లె 2” పేరుతో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఒక నిముషం పాటు సాగిన ఈ టీజర్ సింపుల్ గా ఉన్నా, ప్రేక్షకులకు కావాల్సినంత హార్రర్ ను పంచడంలో కూడా సక్సెస్ అయ్యింది.

‘అన్నాబెల్లె’ సినిమాలో ఉన్న సీన్ మాదిరే చిన్న పిల్ల బొమ్మతో ఆడుకుంటున్న సన్నివేశం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత పిల్ల రూంలోకి శిలువ పట్టుకుని ఓ మహిళ రావడం… అలా జరిగే సన్నివేశాలతో నిండుకున్న చిన్న టీజర్ హార్రర్ లుక్ ను ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డేవిడ్ సాండ్ బెర్గ్ దర్శకత్వం వహిస్తున్నారు.