Anna-Canteens- will reopen in government hospitalsపేదలకు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా కాంటీన్లను జగన్ అధికారంలోకి రాగానే మూసి వేయించారు. ఈ బిల్డింగులు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. బిల్డింగులలో అవినీతికి అందులో భోజనం పెట్టడానికీ లింక్ ఏంటని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ప్రశ్నించేవారు.

అయితే ఆ విషయంలో ప్రభుత్వం తన మాటే నెగ్గించుకుంది. అన్నా కాంటీన్లు మూయించి, ఆ భవనాలను ఇప్పటికే వేరే అవసరాలకు వాడేసుకుంటుంది. పైన ప్రభుత్వం మార్కు కనిపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకున్నారు. అయితే రాజన్న కాంటీన్ల పేరుతో ప్రభుత్వం వీటిని తొందరలో మొదలు పెట్టబోతుందట.

అయితే అన్నా కాంటీన్ల లాగా పెద్ద స్థాయిలో కాకుండా పరిమితంగా పెట్టబోతున్నారట. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లా, 28 ఏరియా, 11 బోధనాసుపత్రులలో వీటిని ఏర్పాటు చెయ్యబోతున్నారట. అక్కడ కూడా పరిమిత స్థాయిలో రోగులకు, వారి బంధువులకు మాత్రమే అందుబాటులో ఉంటాయట.

పేదలకు తక్కువ ధరకే భోజనం అనేది తమిళనాడులో భారీ స్థాయిలో జరుగుతుంది. తెలంగాణాలో, అటు కర్ణాటకలో కూడా ఈ స్కీం పరిమిత స్థాయిలో అమలు అవుతుంది. అప్పట్లో అన్నా కాంటీన్లలో భోజనం ఆ రాష్ట్రాలకంటే ఎంతో మెరుగ్గా ఉండేది. ఇప్పుడు మొత్తానికి కాలగర్భంలో కలిసిపోయింది.