Anna Canteens Closedరెండు రోజుల క్రితం అసెంబ్లీలో మంత్రి బొత్సా సత్యనారాయణ పేదవాడి కడుపుకొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, అన్నా క్యాంటీన్లను మూసివేయలేదని తెలిపారు. అయితే అదే సమయంలో గత ప్రభుత్వం అన్న కాంటీన్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు అదే సాకుగా అన్నక్యాంటీన్లు ఏపీ వ్యాప్తంగా తాత్కాలికంగా మూసివేశారు. పలు జిల్లాల్లో క్యాంటీన్లకు నిర్వాహకులు తాళాలు వేసేశారు. రోజులాగే అహారం కోసం వచ్చిన ప్రజలు నిరాశగా వెనుతిరుగుతున్నారు.

గత కొన్ని రోజులుగా జిల్లాల్లోని అన్నక్యాంటీన్లకు తెలుపు రంగు వేస్తున్నారు. మరోవైపు కొద్దిరోజుల పాటు సేవలు ఆపాలని ఈ పథకానికి భోజనం సప్లై చేస్తున్నఅక్షయపాత్ర ఫౌండేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక భారం వల్ల మూసివేస్తున్నారని వార్తలు వస్తున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం రలో పేరుమార్పుతో అందుబాటులోకి రానున్నాయని లీకులు ఇస్తుంది. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న ప్రదేశాలను కూడా ప్రభుత్వం మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

దీనిపై త్వరలోనే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అయితే కొందరు మాత్రం ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించడానికి ప్రభుత్వం వంకలు పెడుతుందని అంటున్నారు. దీనిపై మరి కొన్ని రోజులు ఆగితే గానీ స్పష్టత రాదు. అయితే ఈ కాంటీన్లు మీద ఆధారపడిన రోజు కూలీలు, పేదప్రజలు మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర నిరాశ చెందారు. ఈ మూసివేత తాత్కాలికం కావాలని కోరుకుంటున్నారు. .