Anna canteen to convering to grama sachivalayamపేదలకు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా కాంటీన్లను జగన్ అధికారంలోకి రాగానే మూసి వేయించారు. ఈ బిల్డింగులు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. బిల్డింగులలో అవినీతికి అందులో భోజనం పెట్టడానికీ లింక్ ఏంటో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. అయితే చంద్రబాబు మార్కు ఏదీ ఉండకూడదు అని ఆ పని చేసారని చాలా మంది ఉద్దేశం.

అన్నా కాంటీన్లను ఆ తరువాత రాజన్న కాంటీన్లు గా మొదలు పెడతారని ప్రచారం చేసినా అదేమీ జరగలేదు. ఇప్పుడు ఆ బిల్డింగులను జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాలుగా మారుస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తున్నప్పటికీ.. పట్టణాల్లో మాత్రం వసతి దొరకడం కష్టంగా మారింది.

దాంతో.. అన్న కాంటీన్లను గ్రామా సచివాలయాలుగా మారుస్తున్నారు. కొద్దిగా మార్పు మార్చి లోపల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే గ్రామా సచివాలయాలు ఏర్పాటు చేసేసినట్టే. పైన ప్రభుత్వం మార్కు కనిపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయిస్తున్నారు. అవినీతి బిల్డింగులలో అన్నం పెట్టకూడదు గాని సచివాలయాలు పెట్టవచ్చా అనేది అసలు ప్రశ్న.

ఈ బిల్డింగులను గ్రామా సచివాలయాలకు వాడుకోవడంతో ప్రభుత్వానికి కాంటీన్లు నడిపే ఆలోచన ఇక లేదని మరోసారి తేలిపోయింది. మరో వైపు సచివాలయాల కోసం నియామకాలు వేగంగా చేపడుతున్నారు. వీటిలో అవకతవకలు జరిగాయని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఇక సచివాలయాల ప్రారంభానికి ఎంతో సమయం లేకపోవడంతో పనులు వేగం అందుకున్నాయి.